Best Foods for Liver: లివర్ ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడం, టాక్సిన్స్‌ను తొలగించడం, ఆహారం అరిగేలా చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా ఎన్నో కీలక పనులు లివర్ చేస్తుంది. కానీ నేటి జీవన విధానం, ప్రాసెస్డ్ ఫుడ్, ఒత్తిడి, కాలుష్యం, అలవాట్లలో పొరపాట్లు వల్ల లివర్‌పై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో లివర్‌ను రక్షించుకోవడానికి ఆహారమే పెద్ద ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Tejashwi Yadav: ‘‘అక్కను చెప్పుతో కొట్టిన తేజస్వీ యాదవ్’’.. లాలూ ఫ్యామిలీలో ఓటమి మంటలు..
వంటింట్లో దొరికే కొన్ని సాధారణ పదార్థాలు లివర్‌కు అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. అందులో పసుపు మొదటిది. కర్‌క్యుమిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం లివర్‌ను శుభ్రం చేస్తుంది. కూరల్లో, పాలు, టీలో పసుపు వేసుకుని తీసుకుంటే లివర్ సహజంగా డిటాక్స్ అవుతుంది. ఉసిరికాయ కూడా లివర్‌కు మంచి మిత్రమే. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు లివర్ ఎంజైమ్‌ల పనితీరును పెంచి శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తాయి. ఉసిరినే నేరుగా తినడం, పచ్చడి, చ్యవనప్రాశ్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
READ MORE: Tejashwi Yadav: ‘‘అక్కను చెప్పుతో కొట్టిన తేజస్వీ యాదవ్’’.. లాలూ ఫ్యామిలీలో ఓటమి మంటలు..
వెల్లుల్లి చిన్నదైనా పెద్ద ప్రయోజనం ఇస్తుంది. లివర్ ఎంజైమ్‌లను పెంచడం, టాక్సిన్స్‌ను బయటికి పంపడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం వంటి మేలు చేస్తుంది. అలాగే తులసి, వాము, కొత్తిమీర వంటి పదార్థాలు కూడా లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇక కూరగాయలు, ముఖ్యంగా బ్రోకలీ, క్యాబేజీ, పాలకూర, కాలే వంటి ఆకుకూరలు లివర్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుభ్రపరచి, విషపదార్థాల్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లు అంటే.. నారింజ, ద్రాక్ష వంటి పండ్లు లివర్ పనితీరును వేగంగా మెరుగుపరుస్తాయి. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను రక్షించి, హానికరమైన కణజాలాల పెరుగుదలను ఆపుతాయి.