ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన […]
శ్రీ అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్సైట్లో (అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్లైన్లో […]
విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లు 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కోసం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికా లలో జరగనుంది. టీమిండియా తమ ఏకైక వార్మప్ గేమ్ లో బంగ్లాదే శ్తో జూన్ 1న న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇకపోతే., టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్ […]
ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు […]
అమెరికా, వెస్టిండీస్‌లో జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్‌లో శిక్షణను ప్రారంభించింది. ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరిగే గేమ్ తో ఈ మెగా ఈవెంట్ మొదలు కానుంది. భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఆపై సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు […]
ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె నగరంలో పోర్షే కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఓ మైనర్ ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ఇంకా సాల్వ్ కాకముందే, ఇప్పుడు మరోసారి గుండెను కదిలించే ప్రమాదానికి సంబంధించిన వీడియో పూణే నుండి బయటకు వచ్చింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. మే 27న తెల్లవారుజామున 1.30 గంటలకు పింప్రి చించ్వాడ్ లోని వాకాడ్ […]
బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్‌లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రెస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది విజయవంతంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండ్వారా ప్రాంతంలో ఉన్న శ్రీ గురునానక్ మ్యాట్రెస్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక […]
IMDb యొక్క గత దశాబ్దంలో వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల జాబితాలో 13వ ర్యాంకింగ్ ను పాన్ ఇండియన్ స్టార్ ‘సమంతా రూత్ ప్రభు’ సాధించింది. ఆమె తప్ప ఆ లిస్ట్ లో మరెవరూ లేరు. దక్షిణాది నుండి టాప్ 15లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె. ఆమె దక్షిణ భారతదేశ చలనచిత్ర ప్రదర్శనల నుండి ఉత్తరాన నిర్మించిన ‘ఫ్యామిలీ మేన్’ లోని రాజి పాత్ర వరకు మరెన్నో వరకు ప్రేక్షకుల హృదయాలను […]
గత 4 దశాబ్దాలుగా తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు రజనీకాంత్. TJ జ్ఞానవేల్ ‘వేట్టైయన్’ చిత్రీకరణ పూర్తి కావడంతో., ఆయన ‘కూలీ’ ని ప్రారంభించబోతున్నాడు. దీనిని లోకేష్ కనగరాజ్ కన్ఫామ్ చేసాడు. అయితే, రజనీకాంత్ తన కొత్త చిత్రం షూటింగ్ కు ముందు హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రను చేయాలనీ ఫిక్స్ అయ్యారు. దింతో నేడు హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్ చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఆయన కేదార్నాథ్, బద్రినాథ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే ప్రణాళికలను కూడా […]
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఇద్దరు దిగంబర జైన సన్యాసులను బట్టలు ధరించలేదని వేధించినందుకు ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయాల్సిందిగా ఎస్టీఎఫ్ని కోరినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అభినవ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, యూట్యూబర్ ప్రవర్తనపై వివాదం చెలరేగడంతో, ఫార్ష్వాన్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం ప్రకారం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని, […]