ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఇద్దరు దిగంబర జైన సన్యాసులను బట్టలు ధరించలేదని వేధించినందుకు ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయాల్సిందిగా ఎస్‌టీఎఫ్‌ని కోరినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అభినవ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, యూట్యూబర్ ప్రవర్తనపై వివాదం చెలరేగడంతో, ఫార్ష్వాన్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం ప్రకారం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని, అభ్యాసాల గురించి తనకు తానుగా అవగాహన కల్పించాలని మాత్రమే కోరుకున్నానని తెలిపాడు.
Rashmika: బికినీలో రష్మిక మందన్న.. మరోసారి డీప్ ఫేక్ వీడియో వైరల్
ఇక సూరజ్ సింగ్ ఫార్స్వాన్ పై ఐపీసీ 67-A (లైంగిక అసభ్యకరమైన చర్యను కలిగి ఉన్న విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం), 153-A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295-A (ఏ వర్గానికి చెందిన వారి మతాన్ని అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యపూర్వక చర్యలు) లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయబడింది. తెహ్రీ గర్వాల్ లోని దేవ్ ప్రయాగ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులను నమోదు చేసారు.
Share Markets: ఎన్నికల చివరి దశ ముందు అమ్మకాల ఒత్తిడి.. నష్టాలలో మార్కెట్స్..
ఇక వైరల్ గా మారిన వీడియో పై డీజీపీ అభినవ్ కుమార్ మాటాడుతూ.. సోమవారం మధ్యాహ్నం వీడియో గురించి తెలుసుకున్నాను. అందులో దిగంబర జైన మతం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయబడ్డాయి. వారి మనోభావాలు, విశ్వాసాలు దెబ్బ తీసేలా ఉన్నాయని తెలిపారు. నేను ఈ విషయాన్ని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారిని విచారించమని కోరినట్లు తెలిపారు. తెహ్రీ గర్వాల్ జిల్లాలోని దేవ్ ప్రయాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొట్టఘటి ప్రాంతంలో ఈ వీడియోను రూపొందించినట్లు వెలుగులోకి వచ్చింది.
ये है चमोली (उत्तराखंड) का यूट्यूबर सूरज सिंह फर्स्वाण। कुछ जैन मुनि उत्तराखंड गए तो उनके कपड़े नहीं पहनकर घूमने पर इसको आपत्ति थी। इसने अमर्यादित व्यवहार करते हुए Video बनाई और वायरल की। पुलिस ने IPC सेक्शन- 153A, 295A आईपीसी एवं 67A में FIR दर्ज कर ली है, गिरफ्तारी बाकी है। pic.twitter.com/YlttPeVybo
— Sachin Gupta (@SachinGuptaUP) May 27, 2024