ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె నగరంలో పోర్షే కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఓ మైనర్ ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ఇంకా సాల్వ్ కాకముందే, ఇప్పుడు మరోసారి గుండెను కదిలించే ప్రమాదానికి సంబంధించిన వీడియో పూణే నుండి బయటకు వచ్చింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. మే 27న తెల్లవారుజామున 1.30 గంటలకు పింప్రి చించ్‌వాడ్ లోని వాకాడ్ ప్రాంతంలో పూణే – బెంగళూరు హైవే వెంబడి సర్వీస్ రోడ్డులో ఈ ఘటన జరిగిందని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు తెలిపారు. రోడ్డు దాటుతుండగా 28 ఏళ్ల అంగద్ గిరిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ కాగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Fire Accident: మ్యాట్రెస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళా కార్మికులు మృతి..
ఇక వైరల్ గా మారిన వీడియోలో రోడ్డుపై పలు వాహనాలు వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఒక వ్యక్తి రోడ్డు దాటడానికి వస్తాడు. కానీ వెనుక నుండి వేగంగా వస్తున్న వాహనం అతన్ని బలంగా ఢీకొట్టడంతో అతను గాలిలోకి ఎగిరి ఆమడ దూరంలో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు కారు, దాని డ్రైవర్ 20 ఏళ్ల వేదాంత్ రాయ్ ను గుర్తించారు. దాంతో అతనిపై ఐపీసీ సెక్షన్లు 304 (A), 338, 337, ౨౭౦, మోటార్ సెక్షన్లు 184, 119/177 కింద కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Delhi rain: ఢిల్లీలో వర్షం.. వేడి నుంచి ఉపశమనం
पुण्यात आणखी एका अपघाताचा व्हिडीओ व्हायरल pic.twitter.com/1q9xeEHXNq
— News18Lokmat (@News18lokmat) May 28, 2024