విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లు 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కోసం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికా లలో జరగనుంది. టీమిండియా తమ ఏకైక వార్మప్ గేమ్ లో బంగ్లాదే శ్‌తో జూన్ 1న న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇకపోతే., టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్ తన అధికారిక X ఖాతాలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నాడు.
Ravindra Jadeja: ఐసిసి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ని జడేజాకు అందించిన టీమిండియా కోచ్..
“కోహ్లి, జైస్వాల్ ప్రపంచకప్ లో ఓపెనింగ్ చేయాలి. ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మూడవ, నాల్గవ బ్యాటింగ్ స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి రావాలని” చెప్పాడు. స్పిన్ ను చక్కగా ఆడుతున్న రోహిత్ పై భారత మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ & జైస్వాల్ వరల్డ్ కప్ లో ఓపెనింగ్ చేయాలి. ఆ తర్వాత రోహిత్, స్కై మనకు లభించే ఆరంభాన్ని బట్టి 3 లేదా 4 స్థానాలలో బ్యాటింగ్ చేయాలి. రోహిత్ స్పిన్ బాగా ఆడతాడు., కాబట్టి 4 వద్ద బ్యాటింగ్ చేయడం ఆందోళన కలిగించదని జాఫర్ X లో రాసుకొచ్చారు.
T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..
న్యూ యార్క్‌లోని కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీ20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్ తో భారత్ మెగా ఈవెంట్ ను ప్రారంభించనుంది. ఆ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఎంతోమంది ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ క్లాష్ జూన్ 9న జరుగుతుంది. తర్వాత వారు తమ గ్రూప్ A మ్యాచ్‌లను ముగించడానికి టోర్నమెంట్ సహ – హోస్ట్ USA తో జూన్ 12న, కెనడాతో జూన్ 15న ఆడతారు.
Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb
— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024