HONOR-BYD: టెక్నాలజీ దిగ్గజం హానర్, ఆటోమొబైల్ సంస్థ BYD తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. HONOR ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ ఫాంగ్ ఫీ (Fang Fei), BYD సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆటోమోటివ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ యాంగ్ డోంగ్‌షెంగ్ (Yang Dongsheng) ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో HONOR CEO జేమ్స్ లీ (James Li), BYD ఛైర్మన్, ప్రెసిడెంట్ వాంగ్ చువాన్ఫు (Wang […]
S*X Rocket: హైదరాబాద్‌లో మరోసారి సెక్స్ రాకెట్ బట్టబయలు అయ్యింది. బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద సెక్స్ రాకెట్‌ను తాజాగా పోలీసులు గుట్టురట్టు చేశారు. రోడ్ నెంబర్ 12లో ఉన్న R-Inn హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరీఫ్ అనే వ్యక్తి ఆ హోటల్లో రెండు రూమ్‌లను అద్దెకు తీసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అతను ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి […]
Rape Attempt: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై నవీన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రోజున బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నవీన్.. తాగడానికి నీళ్లు కావాలని అడిగి ఇంట్లోకి ప్రవేశించాడు. దానితో ఆ బాలిక అతనికి నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాగాక గ్లాసును కిచెన్‌లో పెట్టడానికి బాలిక […]
YouTube Shorts Daily Time Limit: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు రోజులో ఎంతసేపు ‘Shorts’ ఫీడ్‌లో స్క్రోల్ చేయాలో స్వయంగా నియంత్రించుకునే అవకాశం ఇవ్వడం ఈ అప్డేట్ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా యూజర్లు తమ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడమే కాకుండా.. తమ వీయింగ్ అనుభవాన్ని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోగలరు. ఈ ఫీచర్ కోసం యూజర్లు ‘Settings’ మెనూలోకి వెళ్లి […]
Instagram: మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ఇన్స్టాగ్రామ్ తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త అప్డేట్తో టీనేజ్ అకౌంట్ కలిగిన యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ యాప్ ఐకాన్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ కింద మొత్తం ఆరు ప్రత్యేకమైన యాప్ ఐకాన్ థీమ్‌లు అందిస్తోంది. వీటిలో ఫైర్ (Fire), ఫ్లోరల్ (Floral), క్రోమ్ (Chrome), కోస్మిక్ (Cosmic), స్లైమ్ (Slime) వంటి […]
Dr NTR Vaidya Seva Funds: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (నెట్వర్క్) కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేసింది. నిధుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, త్వరలోనే మరో రూ. 250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు […]
Pawan Kalyan: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు […]
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో మొదటి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్. రామకృష్ణన్, అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో కీలక చర్చలు జరిపారు. World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్‌తోనే భారత్‌కు ముప్పు! శ్రీలంక ఉన్నా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ […]
Pawan Kalyan: ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Gold Prices […]
Minister Vanitha: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని రాష్ట్ర మంత్రి సవిత సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం పాపానికి జగనే ప్రధాన పాపాత్ముడని ఆమె అన్నారు. కల్తీ మద్యం కారణంగా గత ఐదేళ్లలో 30 వేల మంది తమ ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయక ప్రజలు అనారోగ్యం పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. Samantha : “నా లైఫ్‌లో […]