Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praggnanandhaa Beat Magnus Carlsen: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) మరోసారి ప్రపంచ నెం.1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు. నార్వేలోని ఓస్లో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్లో కార్ల్సెన్ను క్లాసికల్ ఫార్మాట్లో రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు. కార్ల్సెన్ స్వదేశంలోనే అతడిపై డబుల్ విజయం నమోదు చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే.
ఇప్పటికే టోర్నమెంట్ మూడో రౌండ్లో కార్ల్సెన్ను ఓడించిన ప్రజ్ఞానంద్, తాజా రీమ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఈసారి నల్ల పావులతో ఆడిన భారత గ్రాండ్‌మాస్టర్ అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్ మొత్తం సమయంలో కార్ల్సెన్ టైమ్ ప్రెషర్‌ను ఎదుర్కొన్నప్పటికీ గెలుపు సాధించలేక పోయాడు. గేమ్ 48వ ఎత్తులో కార్ల్సెన్ చేసిన పెద్ద తప్పిదం (Kf4) మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ అవకాశాన్ని ప్రజ్ఞానంద్ వెంటనే అందిపుచ్చుకుని తన క్వీన్‌తో దాడిని ప్రారంభించాడు. కేవలం రెండు ఎత్తుల తర్వాతే విజయం ఖాయం చేసుకుని చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
2022లో ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో కార్ల్సెన్ను ఓడించిన ప్రజ్ఞానంద్, అతడిపై ఏ ఫార్మాట్లోనైనా విజయం సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విశ్వనాథన్ ఆనంద్, పెంట్యాల హరికృష్ణ తర్వాత మూడో భారతీయుడిగా నిలిచాడు. ఇక ఇప్పుడు కార్ల్సెన్ ప్రపంచ నెం.1గా ఉన్న సమయంలో నల్ల పావులతో అతడిని ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఈ ఘనతను గతంలో కార్తికేయన్ మురళి మాత్రమే సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద్ టోర్నమెంట్ ఓపెన్ విభాగం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న “వెస్లీ సో” కు కేవలం రెండు పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. మరోవైపు కార్ల్సెన్ 9 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. టోర్నమెంట్లో ఇంకా రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో అతడి టైటిల్ ఆశలు కష్టంగా మారాయి.
ఇదే టోర్నమెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గూకేష్ కు నిరాశ తప్పలేదు. అతడు క్లాసికల్ మ్యాచ్‌లో అలీరెజా ఫిరౌజ్జా చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ విజయంతో ఫిరూజ్జా రెండో స్థానానికి చేరుకోగా, గుకేశ్ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ కూడా నిరాశపరిచింది. కీలక సమయంలో చేసిన తప్పిదం కారణంగా బిబిసారా అస్సౌబాయేవా చేతిలో ఓడిపోయింది. దీంతో మహిళల విభాగంలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది.
🇮🇳 Pragg does it again and again and again 😱🔥#NorwayChess pic.twitter.com/kF8xA9Xj1V
— Norway Chess (@NorwayChess) June 2, 2026
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు