ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. భుజంగరావు ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆయన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భుజంగరావుతో పాటు ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తుల వద్ద కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టైన ఆయన జైలుకు వెళ్లి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..