CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించిన సీఎం, వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం దిశగా ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలే తెలంగాణకు పునాది:
దశాబ్దాల ఉద్యమం, ఎన్నో త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ కొత్త చరిత్రను సృష్టించారని కొనియాడారు.
Also Read
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
ప్రజల సేవే ప్రభుత్వ ధ్యేయం:
ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని పాలనగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే కొద్దిమంది చేతుల్లో అధికారం కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అని చెప్పారు. అందుకే తమ పాలనను “ప్రజా ప్రభుత్వం”గా అభివర్ణిస్తున్నామని పేర్కొన్నారు.
రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యం:
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని పేర్కొన్న సీఎం.. రైతుల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. 2025-26లో రాష్ట్రంలో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైందని వెల్లడించారు. రైతులపై ఉన్న అప్పు భారాన్ని తగ్గించేందుకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అమలు చేశామని, రూ.20,616 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.27,529 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లు:
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.82,840 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. యాసంగి సీజన్లో దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం ఉండటం రాష్ట్ర వ్యవసాయ శక్తికి నిదర్శనమని అన్నారు.
మహిళా సాధికారత:
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం చెప్పారు. మహిళా సంఘాలకు రూ.1 లక్ష కోట్లు రుణాలుగా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామని తెలిపారు. ఇంకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా శక్తి భవనాల నిర్మాణం వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీ:
యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీతో పాటు వివిధ శాఖల్లో మొత్తం 67,763 పోస్టులను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. త్వరలోనే పలు శాఖల్లో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యా రంగంలో మార్పులు:
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల విస్తరణతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా:
పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో మొదటి ఏడాదే రూ.22,500 కోట్లు కేటాయించి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు సీఎం తెలిపారు. ఇప్పటివరకు లక్ష ఇళ్లు పూర్తయ్యాయని, సెప్టెంబర్ 17 నాటికి మరో రెండు లక్షల ఇళ్లు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట:
దేశంలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను తెలంగాణ విజయవంతంగా నిర్వహించిందని సీఎం చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందని, ఎస్సీ ఉపవర్గీకరణను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఆరోగ్య రంగానికి భారీ పెట్టుబడులు:
రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కొనసాగుతోందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు.
తెలంగాణ రైజింగ్-2047:
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్‌ను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి మూడంచెల వ్యూహం రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్‌గా, ఔటర్ రింగ్ రోడ్-రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని తయారీ పరిశ్రమల కేంద్రంగా, మిగతా ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత అభివృద్ధి మండలాలుగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందన్నారు.
2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం:
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను దేశానికే కాదు, ప్రపంచానికి గేట్వేగా నిలబెట్టేందుకు ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. “తెలంగాణ రైజింగ్-2047 కేవలం ఒక విజన్ కాదు.. రాబోయే తరాల భవిష్యత్తును నిర్మించే మహత్తర కార్యాచరణ” అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!