Rain in Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. పలు చోట్ల వర్షం.. జలమయమైన రహదార్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain in Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా, అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది.
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. అల్ప పీడనం కారణంగా నగరంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Prashanth Neel : ఫైనల్‌గా ప్రశాంత్ నీల్ డార్క్ లుక్‌కు బ్రేక్.. భార్య లిఖితా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!