Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ […]
Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34 […]
Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ […]
IND vs AUS: భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుండగా.. రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు ఆధిపత్యాన్ని చూపించారు. ఆస్ట్రేలియా రెండో రోజు మొదటి […]
Tragedy On Vacation: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు […]
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన […]
Vande Bharat Express: వందే భారత్ రైలు భారతదేశంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ప్రీమియం రైలు. ఇది వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడంలో నూతన ప్రమాణాలను సృష్టించింది. ఇటీవల సెప్టెంబర్ 16, 2024 న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలో కొత్త మార్గాల్లో ప్రారంభించబడింది. అయితే ఈ రైళ్లు మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు వీటిపై రాళ్లు విసిరిన అనేక ఘటనలను చూసాము. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ […]
IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు.. […]
Narendra Modi: ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు రూ.4,500 కోట్ల విలువైన వివిధ పథకాలను కానుకగా అందించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసారు. ‘అందరికీ హౌసింగ్’ ప్రతిజ్ఞలో భాగంగా, ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్లను ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. ఢిల్లీలో ర్యాలీకి ముందు ప్రధాని మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక […]
Gun Firing: నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి 5-6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళన నెలకొనగా.. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని […]