Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
Also Read: Rohit Sharma: రిటైర్‌మెంట్‌పై మౌనం వీడిన రోహిత్
భక్తుల రద్దీని గమనిస్తూ.. టీటీడీ అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని వారు అధికారులు తెలిపారు. అందువల్ల భక్తులు తమ యాత్రలను పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలని, తిరుమలలో టిక్కెట్ల ప్రక్రియను అనుసరించి సమయానికి చేరుకోవాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక క్యూలైన్‌లు, సేవా సిబ్బంది సహాయం అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి, భక్తులు స్వామి వారి దర్శనాన్ని సులభంగా, ఆనందకరంగా పూర్తిచేసుకోవచ్చు.