Dhurandhar : భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ధురంధర్’ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఇండియాలో 1,000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలన్నీ దాదాపుగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలై ఆ ఘనతను సాధించాయి. కానీ, ‘ధురంధర్’ మాత్రం ఏ ఒక్క దక్షిణాది భాషలోనూ విడుదల కాకుండానే(అయితే హిందీలో దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజ్ అయింది) 1,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
Also Read: Teja Sajja: అదంతా దుష్ప్రచారం.. తేజ సజ్జా ఏ సినిమా నుంచి తప్పుకోలేదు!
సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా 1,000 కోట్ల వసూళ్లను సాధించాలంటే పాన్-ఇండియా అప్పీల్ ఉండాలి. గతంలో ఈ ఫీట్ సాధించిన ‘బాహుబలి 2’, ‘RRR’, ‘దంగల్’ వంటి చిత్రాలన్నీ సౌత్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదలై, అక్కడి మార్కెట్ నుంచి సింహభాగం వసూళ్లను రాబట్టుకున్నాయి. కానీ, ‘ధురంధర్’ కేవలం హిందీ వెర్షన్ తోనే ఈ స్థాయి వసూళ్లను సాధించి తన సత్తా చాటింది. సౌత్ లాంగ్వేజ్ మార్కెట్ సహాయం లేకుండానే ఈ చిత్రం ఇంతటి భారీ వసూళ్లను సాధించిందంటే, ఉత్తరాదిలో ఈ సినిమా ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. కథలోని గ్రిప్పింగ్ అంశాలు, మేకింగ్ క్వాలిటీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యాయి. ఇక ప్రాంతీయ భాషల డబ్బింగ్ లేకుండానే ఒక చిత్రం ఇన్ని కోట్లు వసూలు చేయడం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. సౌత్ లాంగ్వేజెస్ రిలీజ్ కాకుండానే ఈ అద్భుతాన్ని చేసిన ‘ధురంధర్’ టీమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా సాధించిన విజయం, కంటెంట్ పవర్ ఉన్నప్పుడు భాషా పరిమితులు అడ్డుకావని మరోసారి నిరూపించింది.