ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు […]
Rythu Maha Dharna: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ […]
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవ్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో […]
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు […]
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ […]
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా కొనసాగించేందుకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా స్థలాల కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే, స్థానిక భూ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుతో […]
Fire Crackers Blast: నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమం అనంతరం జరిగిన బాణసంచా పేల్చడంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్లో బాణసంచా పేల్చేందుకు రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని తీసుకెళ్లారు. టపాసులు పేల్చడం క్రమంలో, నిప్పు […]
Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 […]
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల […]
Gudem Mahipal Reddy: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో పంచాయతీకి ఇంకా పులిస్టాప్ పదానిట్లు కనబడలేదు. విషయం కాస్త గాంధీభవన్ కు చేరుకున్న సమస్య ఇంకా తీరలేదు. పీసీసీ కమిటీ ముందు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ హాజరుకాగా.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులను ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం లోని కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై కాట శ్రీనివాస్ నివేదిక సమర్పించారు. Also Read: […]