ISRO: చరిత్ర సృష్టించిన ఇస్రో.. 100వ మిషన్ విజయవంతం
- చరిత్ర సృష్టించిన ఇస్రో..
- 100వ మిషన్ విజయవంతం
- హర్షం వ్యక్తం చేసిన ఇస్రో ఛైర్మన్ నారాయణన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు ఉండగా.. 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
Also Read: Mahakumbh 2025 : 16 రోజుల్లో 15 కోట్ల మంది పుణ్యస్నానాలు… నేడు మహా కుంభమేళాలో రికార్డు ఖాయం
Also Read
ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే తొలి ప్రయోగం కాగా, ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయయాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత సాధించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇస్రో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
జీఎస్ఎల్వీ-15 రాకెట్‌ను ఒకప్పుడు ఇస్రో ‘నాటీ బాయ్’ అని పిలిచేది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 16 ప్రయోగాల్లో 6 సార్లు ఫెయిల్ అయ్యింది. 37% ఫెయిల్యూర్ రేటు ఉన్నా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగంతో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?