Ramagundam: ఎన్టీపీసీ ఫేజ్-2 ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం
- మొదలైన రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నిర్వహణ.
- ప్రజలు హాజరుకాలేకపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా కొనసాగించేందుకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా స్థలాల కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే, స్థానిక భూ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుతో పాటు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల పహారాలో సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల హాజరుపై ఆంక్షలు విధించడం వివాదానికి దారితీసింది. స్థానిక నాయకులను, ప్రజలను లోనికి అనుమతించకుండా, ఎంపిక చేసిన వారినే ఈ సమావేశంలో పాల్గొనేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల పట్ల కూడా ఇలాంటి ఆంక్షలు విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టు చేసిన స్థానిక నాయకులను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read: Bhumana Karunakar Reddy: చంద్రబాబు మాటలపై పవన్ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎన్టీపీసీ ప్రాజెక్టు పేజ్-2 పై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడానికి నిర్వహించిన ఈ సమావేశంలో ఎక్కువ మంది ప్రజలు హాజరుకాలేకపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, స్థానికుల ఆందోళనలు, పోలీసుల ఆంక్షలు కార్యక్రమం చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నాయి. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు భవిష్యత్తు మీద ఈ అభిప్రాయ సేకరణ ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!