Toxic Gas Leak: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెట్రో డ్రగ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువు లీక్ అవడంతో తీవ్ర కలకలం రేగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలోని 9వ యూనిట్ హెచ్ 7 బ్లాక్‌లో కెమిస్టులు పనిచేస్తుండగా, ఓ పైపు నుంచి ప్రమాదవశాత్తూ విష వాయువు లీకైంది. వాయువు లీక్ కారణంగా సమీపంలో ఉన్న 12 మంది కార్మికులు కళ్లు మంట, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం […]
Pawan Kalyan: హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ […]
Drugs Seized: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్ గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుండి ఢిల్లీకి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 47 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్మగ్లర్లు బాగా ప్రణాళికాబద్ధంగా 5 ట్రాలీ బ్యాగ్‌లలో లగేజ్ స్థానంలో గంజాయిని నింపారు. ఆ తర్వాత గంజాయితో కూడిన బ్యాగ్‌లను గ్రీన్ చానెల్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం […]
Delhi Assembly Election 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025కి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాలలో ఈరోజు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 1.55 కోట్లకు పైగా నమోదిత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేడు ఎన్నికలు జరగనుండగా ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి. ఈ ఎన్నికలలో […]
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి […]
PM Letter: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కి సంతాప సందేశాన్ని పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. ఈ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఈ అనుకోని […]
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే […]
Telangana MLAs: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ […]
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో […]
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా […]