Telangana Congress: హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో […]
South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, […]
Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని హోంమంత్రి తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య […]
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో […]
Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్‌డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన […]
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ […]
Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్‌లో రూ. 30 వేల నగదు […]
Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే, […]
AP GOs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జిఓ ను తెలుగు భాషలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల కోసం కీలకమైన చర్యగా భావిస్తున్నారు. […]
Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం 12.45కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన […]