Drugs Seized: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్ గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుండి ఢిల్లీకి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 47 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్మగ్లర్లు బాగా ప్రణాళికాబద్ధంగా 5 ట్రాలీ బ్యాగ్‌లలో లగేజ్ స్థానంలో గంజాయిని నింపారు. ఆ తర్వాత గంజాయితో కూడిన బ్యాగ్‌లను గ్రీన్ చానెల్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే స్క్రీనింగ్ సమయంలో కస్టమ్స్ అధికారులకు ఇది అనుమానం కలిగించింది.
Also Read: Delhi Assembly Election 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
94 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి ఐదు ట్రాలీ బ్యాగ్‌ల్లో నింపిన గంజాయిను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ఈ చర్య డ్రగ్ మాఫియాలకు కాస్త పాఠం కానుంది. ప్రజలందరూ కూడా డ్రగ్‌లపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తుల గురించి వెంటనే సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.