IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్ […]
Marcus Stoinis: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైన జట్టులో భాగంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కేవలం వన్డే క్రికెట్‌కి మాత్రమే పరిమితమని, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని స్టోయిన్స్ స్పష్టం చేశాడు. అయితే, […]
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు […]
Narasapur: నర్సాపూర్ టౌన్లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్యారానగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట […]
Road Transport and Highways: జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” ద్వారా కీలకమైన మైలిస్టోన్లు సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్రం అదనపు ప్రోత్సాహక సహాయం పొందింది. ఈ పథకం కింద తెలంగాణకు మొత్తం 176.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 లో భాగంగా 51.5 కోట్లు, మైల్స్టోన్ 2 లో 125 కోట్లు అర్హత సాధించింది. అంతేకాక, మోటార్ వెహికల్ టాక్స్ […]
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో […]
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి […]
Indore: ఇండోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాణగంగ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై తెరేశ్వర్ ఇక్కాపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు మంది యువకులు దాడి చేశారు. ఈ సంఘటన అరవిందో ఆసుపత్రి సమీపంలో ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో ఎస్సైను దారుణంగా కొట్టి, బలవంతంగా క్షమాపణ చెప్పించడమే కాకుండా.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. Also Read: Priyanka Chopra : ప్రియాంక చోప్రా లేటెస్ట్ […]
Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది. […]
IND vs ENG: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు […]