MLC Nomination: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. వారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది. ఎమ్మెల్సీగా గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని నరేందర్ రెడ్డి […]
ACB Rides: ట్రాన్స్పోర్ట్ శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల సహా మొత్తం 8 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ […]
SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్ […]
Maha Kumbh Mela 2025: నేడు (శుక్రవారం) ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వార్త అందే సమయానికి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకరాచార్య మార్గ్ లోని సెక్టార్-18లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్న అనేక టెంట్లు బూడిదయ్యాయి. టెంట్ కు మంటలు అంటుకున్న వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అక్కడ […]
REPO Rate: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రటును 25 బేస్ పాయింట్స్ ను తగ్గించింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తాజా తగ్గింపుతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది. 5 ఏళ్ల తర్వాత ఆర్బీఐ రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా […]
Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్ […]
Kaleshwaram: కాళేశ్వరంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేటి (శుక్రవారం) నుంచి ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి. 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరగడం విశేషం. నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు భక్తులను భక్తిశ్రద్ధలలో ముంచెత్తనున్నాయి. మహోత్సవం ప్రారంభ వేడుకగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు […]
TG Congress Delhi Tour: తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతున్నారు. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన […]
Thandel Twitter Review: ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం […]
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అయితే, ఈసారి మాత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రత్యేకమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. అది మరేదో కాదు.. ఓ పెళ్లి వేడుక! ఏంటి రాష్ట్రపతి భవన్లో పెళ్లి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు.. […]