Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను హన్మకొండలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
Also Read: Gannavaram Airport: గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు.. గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం
ఓ వారం పాటు చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి మరింత విషమించి, చివరకు మృతి చెందారు. మృతుడికి భార్య శాంతి, కుమార్తెలు పూజ, ప్రణతి, కుమారుడు కార్తీక్ లు ఉన్నారు. ఈ దారుణ సంఘటనపై మంత్రి వర్యులు సీతక్క విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు పరిస్థితి విషమించడంతో ఎంజియం (ఎయిర్ ఎంబులెన్స్) అవసరం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించానని మంత్రి అన్నారు.
Also Read: Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం, నాగేశ్వరరావు కుటుంబంతో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా విచారణ కొనసాగుతోంది.