Organ Donation: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ […]
SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్లో కూడా విజయం సాధించడంలో […]
Rachin Ravindra: ఈ ఏడాది పాకిస్తాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025ను ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఆ దేశం ప్రతిపాదనలు, తయారీలు వివాదాస్పదంగా మారాయి. 24 సంవత్సరాల తరువాత పాకిస్తాన్లో ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టినప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇంకా సిద్ధతలకు సంబంధించి కొన్ని లోపాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ లో ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీరిస్ తొలి […]
Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక […]
Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్ […]
Orthopedic Walkathon: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద మూనట్ (Moonot) వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్‌థాన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ వాక్‌థాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. 3 కి.మీ, 5 కి.మీ, 7 కి.మీ వాక్‌థాన్ నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకూ కొనసాగింది. ఇందులో వివిధ వయసుల […]
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో […]
Hydra Commissioner: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఆపై హైడ్రా కమిషనర్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ముచ్చటిస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో “తెలుగు వచ్చా?” […]
Hydra: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు నేడు (శుక్రవారం) అక్రమ హోర్డింగులపై దూకుడు పెంచారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా అక్రమ హోర్డింగులు పెరిగినట్లు గుర్తించడంతో, హైడ్రా అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 200 కి పైగా అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకంగా హైదరాబాద్-బెంగళూరు […]
POCSO Case: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని బాలికపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]