Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం..
- 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- ఆలస్యంగా వెలుగులోకి విషయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి తల్లిని నిలదీశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి అని పాఠశాలలో పనిచేసే ఇద్దరు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒక ఇంటర్మీడియట్ టీచర్ తన కుమార్తెను సామూహికంగా అత్యాచారం చేశారని తల్లి కన్నీరుమున్నీరైంది.
Also Read: Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)
Also Read
వెంటనే బాలిక తల్లిని జిల్లా శిశు సంరక్షణ అధికారికి ఫిర్యాదు చేయమని ప్రధానోపాధ్యాయుడు సూచించాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బాలికను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై జిల్లా శిశు సంరక్షణ అధికారి బార్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న బార్గూర్‌కు చెందిన చిన్నసామి (57), మత్తూరుకు చెందిన ఆరుముగం (45), వేలంపాటికి చెందిన ప్రకాష్ (37) అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీని కారణంగా బాలిక గర్భవతి అయినట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పాఠశాలను ముట్టడించి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీరియస్‌గా స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!