SLBC Tunnel Tragedy: SLBC టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) తో […]
IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ నేడు దుబాయ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్-A నుండి ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. దింతో గ్రూప్ స్టేజిలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. భారత క్రికెట్ జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో తొలిప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై […]
Jagdeep Dhankar: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నేడు (ఆదివారం) కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ (IIIT) డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉప రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్, […]
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగేళ్లుగా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తూనే ఉన్నారు. ‘ఢాకూ మహారాజ్’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహా రెడ్డి’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది. […]
Kavya Kalyani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైన ఢీ షో డాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు పేరు తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు. అయితే, తాజాగా ఢీ షో కు చెందిన ఓ డాన్సర్ పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి విషాదకరమైన ఘటనకు సంబంధించింది వార్తల్లో నిలిచింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం […]
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నమెంట్లో ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో తలపడతాయని.. ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అదికూడా, భారత్ కేవలం ఒక్క పరుగు […]
High Court: తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా, 16 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. Read Also: Kannappa […]
Kannappa Teaser: టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్లో విష్ణు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా, టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రాండియర్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే, […]
Heroine Rambha: 90వ దశకంలో అందం, అభినయం, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి రంభ. ఇప్పడు మరోమారు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. నటనకు విరామం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరింత కీలక పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో రంభ నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే అభినయం, హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచారు. […]
Movies In March 2025: మార్చి నెలలో వేసవి హంగులతో థియేటర్లు సందడి కానున్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటు.. మరికొన్ని చైనా సినిమాలు.. అనేక అనువాద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి, ఈ మార్చిలో విడుదల కానున్న చిత్రాలు ఏవో ఓసారి చూద్దాం పదండి. Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల […]