Kavya Kalyani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైన ఢీ షో డాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు పేరు తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు. అయితే, తాజాగా ఢీ షో కు చెందిన ఓ డాన్సర్ పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి విషాదకరమైన ఘటనకు సంబంధించింది వార్తల్లో నిలిచింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం ‘ఢీ’ షో డాన్సర్ అభి అంటూ తన సెల్ఫీ వీడియోలో తెలిపింది.
Read Also: Heroine Rambha: వెండితెరకి గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్
ఆత్మహత్యకు ముందు కావ్యకళ్యాణి ఒక వీడియో రికార్డ్ చేసి తన బాధను వెల్లడించింది. “నాకు న్యాయం జరగాలి. నేను చచ్చిపోబోతున్నాను.. నా చావుకి కారణం అభి. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, నన్ను ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు” అని కన్నీటి పర్యంతం అవుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే, ఈ విషాదకర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సంఘటన ఇండస్ట్రీలో కలకలం రేపగా, యువతి మృతి సంచలనంగా మారింది.