Movies In March 2025: మార్చి నెలలో వేసవి హంగులతో థియేటర్లు సందడి కానున్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటు.. మరికొన్ని చైనా సినిమాలు.. అనేక అనువాద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి, ఈ మార్చిలో విడుదల కానున్న చిత్రాలు ఏవో ఓసారి చూద్దాం పదండి.
Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల
* హిందీలో విజయవంతమైన ‘ఛావా’ (Chhaava) సినిమా తెలుగులోకి అనువాదమవుతోంది. శంభాజీ మహారాజ్ వీరగాథగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది.
* మహిళల సాధికారతకు అద్దం పట్టే ‘నారి’ (Naari: The Women) సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఆమని, వికాస్ వశిష్ఠ, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూర్య వంటిపల్లి తెరకెక్కించారు.
* మార్చి 7న మరో సినిమా ‘జిగేల్’ (Jigel) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి మల్లి దర్శకుడు.
* పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కథాంశంతో తెరకెక్కిన ‘కోర్ట్’ (Court) సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించగా.. ప్రియదర్శి, హర్ష్ రోషన్ కీలక పాత్రలు పోషించారు.
* హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba) కూడా మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకుడు.
* ఇక మార్చి 28న ఏపీ డిప్యూటీ సీఎం నటించిన పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పార్ట్ 1 విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదన్న చర్చ సినీ వర్గాల్లో ఉంది.
* నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robinhood) మూవీతో ప్రేక్షకుల ముందుకు మార్చి 28న రాబోతున్నారు. పవన్ కల్యాణ్ కు నితిన్ వీర అభిమాని. ఈ ఇద్దరి చిత్రాలు ఒకేరోజు బాక్సాఫీసు ముందుకురానుండడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. కాకపోతే, ‘హరిహర వీరమల్లు’ ఆ సమయానికి విడుదల కాకపోవచ్చని టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది.
Read Also: Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..
* సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) సినిమా మార్చి 29న విడుదల కానుంది.
* వీటితోపాటు అనువాద సినిమాలలో ‘కింగ్‌స్టన్’ (Kingston), ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on Duty) మార్చి 7న విడుదల అవుతుండగా.. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్ 2’ (Veera Dheera Sooran 2), మోహన్‌లాల్ ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan) మార్చి 27న రానున్నాయి.
* మరోవైపు బాలీవుడ్ లోకూడా ఈ నెల బిగ్ మూవీస్ విడుదలకానున్నాయి. ‘ది డిప్లొమాట్’ (The Diplomat) మార్చి 14, ‘సికందర్’ (Sikandar) – ఈద్ స్పెషల్ గా విడుదల కానుంది.
మార్చిలో విడుదలకు సిద్ధమైన సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు వస్తున్నాయి. కానీ కొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.