S*exism in Japan: 73 మంది మహిళా ఎంపీలకు రెండే బాత్రూమ్స్..
- జపాన్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు మరుగుదొడ్ల కొరత..
- మహిళల ప్రాతినిధ్యం పెరిగినా మౌలిక వసతులు మారలేదని ఫిర్యాదు..
- మెనోపాజ్ అనుభవాలపై బహిరంగంగా మాట్లాడిన విపక్ష నేత యాసుకో కొమియామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exism in Japan: జపాన్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉండగా.. వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ దగ్గర కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జపాన్ ప్రధాని సనాయే టకైచి సహా వివిధ పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు సంతకాలు చేశారు. పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాలు మాత్రం ఇప్పటికీ పురుష ఆధిపత్య కాలానికి చెందినవిగానే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు
Also Read
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
అయితే, జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించారు. అప్పటికి దేశంలో మహిళలకు ఓటు హక్కు లేదు.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్‌లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నిక కావడం మొదలైంది. అయితే, కాలం మారినా పార్లమెంట్ భవనంలో మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా లేకపోవడంతో విమర్శలు దారి తీసింది. ఈ సందర్భంగా విపక్ష కానిస్టిట్యూషనల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన యాసుకో కొమియామా మాట్లాడుతూ.. పురుషుల కోసం పార్లమెంట్లో 12 మరుగుదొడ్లు (మొత్తం 67 స్టాల్స్) ఉంటే, మహిళల కోసం 9 మరుగుదొడ్లు (మొత్తం 22 క్యూబికల్స్) మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొనింది. ఇక, ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ దగ్గర మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో సమావేశాలకు ముందు మహిళలు బాత్రుమ్ కి వెళ్లడానికి పెద్ద ఎత్తున క్యూ కట్టడం.. చాలా అవమానకరమైన పరిస్థితి అని కొమియామా వ్యాఖ్యానించారు.
Read Also: Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కి ట్రీట్.. ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్‌కి డేట్ లాక్
ఇక, ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో 148 దేశాల్లో జపాన్ 118వ స్థానంలో కొనసాగుతుంది. వ్యాపారం, మీడియా, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులు తరచూ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారు.. రాజకీయాలకంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ
పార్లమెంటులో మహిళల సంఖ్య..
ప్రస్తుతం: దిగువ సభలో 465 మంది ఎంపీలలో 72 మంది మహిళలు, ఎగువ సభలో 248 మందిలో 74 మంది ఉమెన్స్ ఉన్నారు. అయితే, మహిళలకు కనీసం 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే జపాన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామాల మధ్య కొత్త ప్రధాని సేన్ తకైచి నిర్వహించిన భేటీలో దేశంలో పని, జీవిత సమతుల్యతపై మరోసారి చర్చ ప్రారంభమైంది. గతంలో ఆమె పని, పని, పని మాత్రమే అనే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను రోజుకు 18 గంటలు పని చేస్తాను.. పని, జీవిత సమతుల్యతను నమ్మనని చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. మొత్తంగా జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఒక్కసారిగా ప్రపంచదేశాల్లో చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!