Hyderabad: హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల తయారీని పోలీసులు గుర్తించి దాడి నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొని 20 రకాల కిరాణా వస్తువులను స్వాధీనం చేసుకుంది. కల్తీ వ్యాపారస్తులు ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పలు నిత్యవసర వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లు ప్రజల్లో ఎక్కువగా వినియోగించే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేసి కల్తీ ఉత్పత్తులను తయారు చేశారు. వీటిని అసలు బ్రాండ్ల ప్యాకింగ్‌లోనే మార్కెట్లోకి […]
SLBC: SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్), క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుమంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్ […]
Assembly Sessions: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 13) ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 14న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై […]
Bhadrachalam: భద్రాచలంలో ప్రతీ ఏటా వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. భక్తులు శ్రీరాముని కల్యాణాన్ని నేరుగా తిలకించేందుకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి వార్షిక కల్యాణోత్సవం కోసం భక్తులు సెక్టార్ టికెట్లను దేవస్థానం వెబ్సైట్ bhadradritemple.telangana.gov.in ద్వారా కొనుగోలు చేయవచ్చు. Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. […]
Jawahar Nagar: హైదరాబాద్‌లోని జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రియుడుతో కలిసి అమానుష చర్య: బీహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె […]
World Record: ప్రస్తుతం ఇంటర్నెట్ రాజ్యమేలుతుంది అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడు ఇంటర్నెట్లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ‘నార్మే’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. Read Also: Job Resignation: చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.. కారణమేంటంటే? నార్మే చేసిన ఈ […]
Job Resignation: ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. ఇక తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగులు తమ ఉద్యోగ కష్టాలు కార్యాలయ అనుభవాలు, కార్యాలయ సమస్యలను పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా మారింది. ఉద్యోగులు తమ కథలను పంచుకోవడానికి, అలాగే సలహా తీసుకోవడానికి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సొసైల్ మీడియా అండగా నిలుస్తోంది. Read Also: Ranya Rao: ప్రోటోకాల్ […]
World Most Polluted Cities: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ (IQAir) ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ (Byrnihat) నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా […]
JioHotstar: జియో వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో, తన వినియోగదారుల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.100 మాత్రమే. దీనితో వినియోగదారులు ఇప్పుడు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను తక్కువ ఖర్చుతో వీక్షించే అవకాశం పొందుతారు. ఇది క్రికెట్, వినోద ప్రేమికులకు గొప్ప ఆఫర్ అని చెప్పుకోవచ్చు. గతంలో, జియో రూ.195కే జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు […]
Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా […]