SLBC: 19వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. రోబోలను వినియోగించేందుకు రంగం సిద్ధం
- SLBC టన్నెల్ వద్ద 19వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.
- రోబోలను వినియోగించేందుకు రంగం సిద్ధం
- వాళ సాయంత్రానికి మరో రెండు మృతదేహాల వెలికితీతకు అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SLBC: SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్), క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుమంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై అధ్యయనం చేశారు. మంగళవారం రోబోలకు సంబంధించిన ఇన్‌స్టలేషన్ సామగ్రితో టన్నెల్ వద్దకు చేరుకుని మాస్టర్ రోబో, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను క్యాంపు కార్యాలయంలో సిద్ధం చేశారు.
Read Also: Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
బుధవారం ఉదయానికి మూడు ప్రత్యేక రోబోలు టన్నెల్‌కు చేరనున్నాయి. ఈ రోబోలు బురద తొలగించడం, మట్టిని తవ్వడం, ఇనుప సామగ్రిని కత్తిరించడం, రాళ్లను పగలగొట్టడం వంటి పనుల్లో సహాయపడతాయి. మట్టి, ఇతర మెటీరియల్, రాళ్లను ప్రత్యేక పైపుల ద్వారా బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు రోబోలను పంపుతామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. అలాగే కేరళ నుంచి ప్రత్యేకంగా రప్పించిన క్యాడవర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్‌లోకి పంపించనున్నారు. మానవ అవశేషాలను పసిగట్టే సామర్థ్యమున్న ఈ జాగిలాలు సంఘటన జరిగిన ప్రదేశాల్లో వాసనను గుర్తిస్తాయి. జాగిలాలు పసిగట్టిన ప్రదేశాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహం లభించిన ప్రదేశంలో తవ్వకాలు చేస్తుండగా దుర్వాసన వెలువడుతున్నట్టు గుర్తించారు. అక్కడ మరొకరి అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున శిథిలాలను తొలగిస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మంగళవారం సహాయ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి మరో రెండు మృతదేహాల వెలికితీతకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. TBM (టన్నెల్ బోరింగ్ మిషన్) మట్టి తొలగింపు, డీ వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!