Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి అనేక విషయాలపై మాట్లాడారు. ఈ సందరబంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం అంటేనే సాంకేతికతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసి ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన 2014లోనే మార్పు, పారదర్శకత నినాదంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించింది. పేదరిక […]
CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం దోహదపడుతోందని గవర్నర్ పేర్కొన్నారు. సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ […]
Galla Madhavi: గుంటూరు నగరంలోని కీలకమైన జీటీ రోడ్డులో గుంతలు పెరిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో స్వయంగా రోడ్డుపైకి దిగిన ఆమె, కార్యకర్తలతో కలిసి గుంతలు పూడ్చే పనిలో పాల్గొన్నారు. జీటీ రోడ్డులో గుంతలు ప్రమాదకరంగా మారాయని, ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగర కౌన్సిల్లో రోడ్డు బాగు […]
Minister Anita: తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసు పురోగతిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆమె తిరుపతి ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు, సంబంధిత సమాచారం […]
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal)ల వివాహం అధికారికంగా రద్దయింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలకు తెరదించుతూ.. పెళ్లి రద్దు విషయాన్ని మందాన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించింది. మందాన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా గోప్యతను కోరుకునే వ్యక్తిని, […]
Sabarimala Prasadam: శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పొందడానికి శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తులు తామున్న […]
Cholesterol Rise: చలికాలం రాగానే శరీరానికి మరింత శ్రద్ధ, సంరక్షణ అవసరం అవుతుంది. చలి రోజులలో చాలా మందికి వారి ఆరోగ్య విషయంలో, రోజువారీ దినచర్యలో మార్పులు వస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వాటిలో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం. ఇది గుండె ఆరోగ్యానికి ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. చల్లని వాతావరణంలో ఆహారపు అలవాట్లు, దినచర్య, శరీర పనితీరులో మార్పులు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా శీతాకాలంలో కొలెస్ట్రాల్ […]
Sugar Level Symptoms: నేటి కాలంలో డయాబెటిస్ (మధుమేహం) కేసులు వేగంగా పెరుగుతున్నాయి, దీని ప్రభావం అన్ని వయసుల వారిపై పడుతోంది. ఈ పరిస్థితి శరీరంలోని శక్తి సమతుల్యతను (Energy Balance) నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయనప్పుడు లేదా తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీని ఫలితంగా అధిక చక్కెర స్థాయి (High Sugar Level) సమస్య అంటే డయాబెటిస్ వస్తుంది. సాధారణంగా ఉపవాసం (Fasting) ఉన్నప్పుడు చక్కెర […]
Samsung Galaxy S26 series: శామ్సంగ్ (Samsung) అభిమానులకు గుడ్ న్యూస్. 2026లో విడుదల కానున్న శామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ గెలాక్సీ S26 (కోడ్‌నేమ్ M1), S26+ (M2), S26 అల్ట్రా (M3) గురించి లీక్స్ రావడం మొదలయ్యాయి. ఈ కొత్త సిరీస్ భారీ మార్పుల కంటే, ప్రస్తుత డిజైన్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) నుండి వచ్చిన తాజా లీక్‌ల ప్రకారం.. అంతర్గత టెస్టింగ్ బిల్డ్‌ల నుండి సేకరించిన […]
Ellyse Perry: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) 2025 లో భాగంగా డిసెంబర్ 7న నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా జరిగిన 40వ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అదరగొట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఆడిన ఈ మ్యాచ్‌లో పెర్రీ 71 బంతుల్లో 111 పరుగుల సెంచరీని సాధించింది. ఈ నేపథ్యంలో WBBL చరిత్రలో 5000 పరుగుల మార్క్ అందుకున్న రెండో మహిళగా రికార్డ్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఘనతను అందుకున్న […]