Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal)ల వివాహం అధికారికంగా రద్దయింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలకు తెరదించుతూ.. పెళ్లి రద్దు విషయాన్ని మందాన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించింది. మందాన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా గోప్యతను కోరుకునే వ్యక్తిని, అలాగే ఉండాలని అనుకుంటున్నాను. కానీ, వివాహం రద్దు చేయబడింది అని స్పష్టం చేయాలనుకుంటున్నానని మందాన పేర్కొంది.
Virat Kohli-Vizag: విశాఖ అంటేనే ఊపొస్తుందా?.. విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే పిచ్చెక్కడం పక్కా!
నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నానని, మీరంతా కూడా అదే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె కోరింది. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, అలాగే మేము ఈ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. తన దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుందని మందాన తెలిపారు. మనందరినీ నడిపించే ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని నేను నమ్ముతాను, నా విషయంలో అది ఎల్లప్పుడూ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే. వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇక ముందుకు సాగే సమయం ఆసన్నమైంది అని ఆమె ముగించారు.
భారత మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత మంధాన, ముచ్ఛల్‌ల వివాహం అత్యంత ప్రముఖంగా జరుగుతుందని అంతా ఆశించారు. కానీ, పెళ్లి వేడుకకు కొద్ది సమయం ముందు మంధాన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో వేడుకలు నిలిచిపోయాయి. దీని తర్వాత ముచ్ఛల్‌పై మోసం ఆరోపణలు రావడంతో ఊహాగానాలు, పుకార్లు వేగంగా వ్యాపించాయి. అయితే ముచ్ఛల్ కుటుంబం ఈ ఆరోపణలను ఖండించింది. తమ కుమారుడిపై తప్పుడు సమాచారం ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!
ఇక మందాన పోస్ట్ తర్వాత, పలాష్ ముచ్ఛల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మందానతో తన వ్యక్తిగత సంబంధం నుంచి తాను ముందుకు సాగుతున్నానని తెలిపారు. తనపై నిరాధారమైన పుకార్లు, విమర్శల మధ్య, తన గురించి తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేసే ఎవరిపైనైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేను నా జీవితంలో ముందుకు సాగాలని, ఈ వ్యక్తిగత సంబంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. నాకు అత్యంత పవిత్రమైన విషయం గురించి నిరాధారమైన పుకార్లకు ప్రజలు అంత తేలికగా స్పందించడం చూడటం నాకు చాలా కష్టమైంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ.. నేను నా నమ్మకాలను పట్టుకొని గౌరవంగా దీనిని ఎదుర్కొంటానని ముచ్ఛల్ అన్నారు. మూలాలే లేని గాసిప్‌ల ఆధారంగా ఒకరిని తీర్పు చెప్పే ముందు మనం ఒకసారి ఆలోచించడం నేర్చుకోవాలని నిజంగా ఆశిస్తున్నాను. మన మాటలు మనకు అర్థం కాని రీతిలో గాయపరచగలవు. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన ముగించారు.