Sabarimala Prasadam: గుడ్ న్యూస్.. శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- భక్తులకు శబరిమల ప్రసాదం ఇంటికే అందిస్తున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్..
- అరవణ పాయసం, అప్పం ప్రసాదం కోసం భక్తులు ఇప్పుడు శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు.
- భారతదేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా శబరిమల ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.
- ప్రసాద కిట్‌లో నెయ్యి, అరవణ పాయసం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం
- 1 టిన్ అరవణ ప్రసాదం కిట్ ధర 520, 4 టిన్ కిట్ 960, 10 టిన్ కిట్ 1,760.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Prasadam: శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పొందడానికి శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తులు తామున్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే.. నేరుగా శబరిమల నుంచి అరవణ ప్రసాదం ఇంటికే చేరుతుంది. దీనికోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తోంది.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం, ఇంట్లో నుంచే అరవణ ప్రసాదాన్ని కొనుగోలు చేసేలా శబరిమలలోని పోస్టాఫీస్ ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక ఈ ప్రసాద కిట్‌లో నెయ్యి, అరవణ పాయసం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం ఉంటాయి. ఈ విషయమై శబరిమల పోస్టాఫీస్ అధికారులు మాట్లాడుతూ.. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల ప్రసాదాన్ని అందించడమే మా లక్ష్యమని.. దీనికోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు.
Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!
ఇక పోస్టాఫీసుల ద్వారా ప్రసాదం కొనుగోలు చేయడానికి ధరల విషయానికి వస్తే.. ఒక టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 520, 4 టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 960, 10 టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 1,760 గా నిర్ణయించారు. ఇందుకోసం పోస్టాఫీసులో ప్రసాదం కోసం డబ్బు చెల్లిస్తే, కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం నేరుగా మీ ఇంటికి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది మకరవిళక్కు పూజ ప్రారంభమై, కొద్ది రోజుల అనంతరం అయ్యప్ప ఆలయం మూసివేయబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన వాటిని పంపాలో భద్రంగా ఉంచుతారు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!