Kantara: దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు […]
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి […]
Interest Rates: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని సాధారణ స్థితికి తెచ్చే వరకూ వడ్డీ రేట్లు పెంచుతూ పోవాలని సెంట్రల్ బ్యాంకులకు ఆమె సూచించారు. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచబోతుందన్న అంచనాల మధ్య ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా ఈ సలహా ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం రావాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం […]
T20 World Cup: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మళ్లీ మునుపటి కోహ్లీ కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన […]
CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లోనూ గెలవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వైసీపీ నేతలకు ఈ అంశంపై ఆయన దిశానిర్దేశం చేశారు. తాజాగా టీడీపీ ఖాతాలో ఉన్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ బుధవారం నాడు వైసీపీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పం సెగ్మెంట్ నుంచి ప్రారంభించారు. అనంతరం అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతోనూ […]
Vidadala Rajini: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2023 నాటికి ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రూ. 700 కోట్లతో ఉద్దానంలో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచినీటి పథకం 80 శాతం పూర్తయిందని.. రక్షిత మంచి నీటి పథకాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఉద్ధానం కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు. బీసీల ద్రోహి […]
T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే గ్రూప్-2లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తాజాగా గ్రూప్-1లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో రెండు మ్యాచ్‌లు చేరాయి. ఇప్పటివరకు టోర్నీలో సూపర్-12 […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను వర్మ కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్, రామ్‌గోపాల్ వర్మ సమావేశం సాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు. అయితే జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ, […]
ICC Rankings: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకుల్లోనూ తన సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో లాంగ్ జంప్ వేసి టాప్-10లోకి ప్రవేశించాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందు 35వ ర్యాంకులో ఉన్న విరాట్ కోహ్లీ ఆ టోర్నీతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో […]
Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని […]