Kantara: కాంతార మూవీని చూడబోతున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara: దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా నిలిచిన ఈ మూవీని ప్రధాని నరేంద్ర మోదీ అతి త్వరలో వీక్షించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 14న ప్రధాని మోదీకి చిత్ర యూనిట్ ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో నటించిన రిషబ్ శెట్టితో కలిసి మోదీ ఈ చిత్రాన్ని చూస్తారని తెలుస్తోంది.
Read Also: Karthi: ‘సర్దార్’ హిట్.. పార్ట్ 2 ప్రకటించిన హీరో
Also Read
ఈ మూవీకి డైరెక్టర్ కమ్ హీరో రిషబ్‌శెట్టి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. 2010లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టికి ఇన్నాళ్లుగా పెద్దగా పేరు రాలేదు. కానీ కాంతార మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. కాగా కాంతార మూవీ కేజీఎఫ్-2 రికార్డులను కూడా బీట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాల్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా కాంతార నిలిచింది. యష్ నటించిన కేజీఎఫ్-2 సినిమా టికెట్లు 75 లక్షలు అమ్ముడవగా.. కాంతార టికెట్లు ఇప్పటివరకు 77 లక్షలు విక్రయమయ్యాయి. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేయగా మంచి లాభాలను అందించింది. ‘కాంతార’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!