Ravichandran Ashwin: గత ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి ఓవర్‌లో ఐదో బంతిని అశ్విన్ ఆడకుండా వదిలేయడంతో అది వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ బంతి మలుపు తిరిగి ప్యాడ్లను తాకి […]
Human Washing Machine: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఒకప్పుడు చేత్తో బట్టలు ఉతికేవాళ్లు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉండటంతో పని సులువుగా మారిపోయింది. వాషింగ్ మెషీన్ కారణంగా గృహిణీలకు పనిభారం కూడా ఎంతో తగ్గింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కాకుండా మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ కూడా రాబోతోంది. ఈ యంత్రాన్ని జపాన్‌కు చెందిన కంపెనీ […]
Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. బాబర్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టుపైనా ఓడటం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటల తూటాలతో పాటు సెటైర్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు. […]
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. రెండు ఎకరాల నుంచి ఇంత ఆస్తిని చంద్రబాబు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే ఆయన నీచ చరిత్రకు ప్రజలు చరమగీతం పాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడిలా జగన్ సామాజిక […]
Guinnis Record: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ప్రజల అభిరుచి తగిన విధంగా పార్కుల్లో నిర్వాహకులు అడ్వంచెర్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్లైడ్స్ నుండి డ్రాప్ టవర్ల వరకు ప్రజలు ఈ రైడ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ రైడ్‌లలో సాహసోపేతమైన రోలర్ కోస్టర్ కచ్చితంగా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్ వేగానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఈ ఏడాది […]
Vellampalli Srinivas: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన సమయంలో వర్ల రామయ్య తన నివాసంలోనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం బయటకు […]
AUS Vs ENG: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే వరుణుడి వల్ల మూడు మ్యాచ్‌లు వాష్ అవుట్ కాగా శుక్రవారం వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వర్షం తగ్గినా మైదానం పూర్తిగా తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం […]
PAK Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో గురువారం సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అటు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో కూడా స్వయంగా ట్వీట్ చేశారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ మిస్టర్ బీన్‌ను కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. […]
Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌లో ఎవరూ సీరియస్‌గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్, […]