SSMB 28: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 28: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఖలేజా తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత సినిమా షూటింగులకు మహేష్‌బాబు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ మూవీ రెండో షెడ్యూల్ నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. సెకండ్ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్ షూటింగ్‌ను అతిత్వరలో స్టార్ట్ చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ వస్తాయని నాగవంశీ ట్వీట్ చేశాడు.
Read Also: NTR 30: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు పండగే..!!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే హీరో మహేష్‌బాబు ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లి తాజాగా ఇండియాకు తిరిగొచ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే నటిస్తోంది. మహర్షి మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో మూవీ ఇది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. కాగా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలలో టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగులు నమోదవుతున్నాయి.
The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned!
— Naga Vamsi (@vamsi84) October 31, 2022
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్‌డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!