NTR 30: జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాలని భావించడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే అభిమానులకు కొత్త ఉత్సాహం ఇచ్చేలా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాదాపు అన్ని ప్రముఖ మూవీ వెబ్‌సైట్లు ఈ అప్‌డేట్ గురించి రాసుకొచ్చాయి.
Read Also: Tollywood: ఈ వీకెండ్ సందడి చేసే సినిమాలు ఏవంటే….
తాజాగా ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని ఈ అప్‌డేట్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. నవంబర్ 16న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు డీవోపీ రత్నవేలు అందిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ పనిచేస్తున్నాడు. దర్శకుడు కొరటాలతో కలిసి వీళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో త్వరలోనే సినిమా పట్టాలు ఎక్కనుందని వెల్లడించారు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. నందమూరి తారక్ రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు.
Admits the rumours, here’s the team confirmation about #NTR30 pic.twitter.com/23DofSqef9
— Aakashavaani (@TheAakashavaani) October 31, 2022