Smoking in Marathon: వీడెవడండీ బాబూ.. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్ నిర్వాహకులు ఈ ఈవెంట్ నిర్వహించారు. మొత్తం 1500 మంది ఈ రేసులో పాల్గొనగా చెన్ మాత్రమే మారథాన్‌లో స్మోక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్‌కు ఇలా స్మోక్ చేస్తూ పరిగెత్తడం తొలిసారి కాదు. 2018, 2019లో జరిగిన మారథాన్‌లలో కూడా ఇలాగే సిగరెట్ తాగుతూ పరిగెత్తాడు.
Read Also: Formula E-Racing: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు.. టిక్కెట్ ధర ఎంతంటే..?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా చెన్ సిగరెట్ తాగుతూ పరిగెత్తే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్‌లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు చెన్ చర్యపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా మరికొందరు నెటిజన్‌లు మాత్రం ఇలా చేయడం తప్పు అంటూ మండిపడ్డారు. ధూమపానం చేయకపోతే చెన్ మరింత మెరుగ్గా రన్నింగ్ చేసేవాడు అని అభిప్రాయపడ్డారు. రన్నింగ్ ఆరోగ్యానికి మంచిది అని.. కానీ ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని.. ఈ రెండూ ఒకేసారి చేయడం వల్ల వ్యక్తిత్వం దెబ్బతింటుందని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం నికోటిన్ చెన్‌కు మంచి ఎనర్జీ ఇచ్చిందని.. అందుకే అతడు ఇలా పరిగెత్తాడని సెటైర్లు వేశారు. కాగా వేలమంది పాల్గొన్న ఈ మారథాన్ ఈవెంట్‌లో చెన్ 515వ ర్యాంక్ పొందినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!