Formula E-Racing: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు.. టిక్కెట్ ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్‌లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్‌ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ పాస్‌లు, రెండు రోజుల వారాంతపు పాస్‌లుగా.. రెండు రకాల టికెట్లను అందుబాటులో ఉండనున్నాయి. సాధారణ పాస్ టిక్కెట్ ధర రూ.749 గా ఉండగా.. రెండు రోజుల వారాంతపు పాస్ ధర రూ. 1,249 గా నిర్వాహకులు నిర్ణయించారు.
Read Also: IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది. మొదటి, 4వ రౌండ్లు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో జరుగుతాయి. రెండు, 3వ రౌండ్‌లు చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరుగుతాయి. ఈ లీగ్‌లో ఇద్దరు భారతీయ డ్రైవర్లు, ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్లు రేసింగ్‌తో కూడిన ఆరు సిటీ ఆధారిత జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్ ఉంటారు. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈవో దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రేస్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!