Twitter: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం బ్లూటిక్ ఛార్జీలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బ్లూ టిక్ రూల్స్ మార్చడంతో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది బ్లూ టిక్ కోసం చందా కట్టి నకిలీ ఖాతాలను తెరవడం ప్రారంభించారు. అయినా ఛార్జీల వసూలు విషయంలో ఎలాన్ మస్క్ తగ్గలేదు. దీంతో ట్విట్టర్ యూజర్లు.. సెలబ్రిటీల అసలు అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నకిలీల బెడద తగ్గించేందుకు తాత్కాలికంగా బ్లూటిక్ సేవలను ట్విట్టర్ నిలిపివేసింది.
కాగా తన యూజర్ల కోసం బ్లూ టిక్ ప్లాన్‌ను మళ్లీ తీసుకొస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. నకిలీల బెడదను తట్టుకునేలా మార్పులు చేర్పులు చేసి తిరిగి ఈ నెల 29న బ్లూ టిక్‌ను రీలాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే 8 డాలర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఫీచర్లను ట్విట్టర్‌లో రోల్ అవుట్ చేసి.. సేఫ్టీ, సెక్యూరిటీని పెంచుతూ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తిరిగి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Telangana: కోడలు అకాల మరణం.. తట్టుకోలేక గుండెపోటుతో వృద్ధుడు మృతి
కాగా నకిలీ ఖాతాల నుంచి నకిలీ ట్వీట్ల కారణంగా చాలా పెద్ద కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ అండ్ కో ఇన్సులిన్ ఉచితం అంటూ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తర్వాత కంపెనీ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంతే కాదు పెప్సీ అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కోక్ బెటర్ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ అకౌంట్ ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ఈ ఫేక్ అకౌంట్ ట్విట్టర్ హ్యాండిల్ పేరు PEPSICO అని కాకుండా PEPICO అని ఉంది.
Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid
— Elon Musk (@elonmusk) November 15, 2022