పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్ […]
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా […]
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇంత హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీపావళి పండుగ రోజు నామినేషన్లు వేయడమేంటని నిలదీశారు. దీపావళి పండగ కూడా జరుపుకోనివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదని… దీపావళి పండగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే […]
రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెలారస్ దేశానికి చెందిన కార్గో విమానం కూలిపోయిన ఘటనలో ఏడుగురు స్పాట్ డెడ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. రష్యాలోని తూర్పు సెర్బియాలో ఎఏన్-12 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. Read Also: తాలిబన్లు మరో సంచలన నిర్ణయం: అమెరికాను దెబ్బకొట్టేందుకు… ఈ ఘటనకు ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని […]
కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది. […]
సోషల్ మీడియా పరిధి విస్తృతం కావడంతో పలు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పుష్ప, రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’కు కూడా లీకుల బారిన పడిందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ […]
దేశాన్ని మరోసారి జికా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా యూపీలో జికా వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే యూపీలో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వ్యక్తులు, 14 మంది మహిళలు ఉన్నారు. యూపీలో ఎక్కువగా కాన్పూర్ ప్రాంతంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న కాన్పూర్‌లో తొలి జికా వైరస్ వెలుగు చూసింది. Read Also: మార్కెట్‌లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి […]
దీపావళి పండగను స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ షేర్ చేసిన ఫోటోలో అంతా యంగర్ జనరేషన్ కనిపిస్తోంది. అల్లు అర్జున్-స్నేహ, రామ్‌చరణ్-ఉపాసన, నిహారిక-చైతన్య, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీతో పాటు పలువురు మెగా కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో యంగ్ హీరో సాయి తేజ్ మాత్రం కనపడలేదు. […]
గత నెలలో ఉల్లిపాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టినా కిలో రూ.40కి పైగానే పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని.. దీంతో తాము బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేస్తుండటంతో ధరలు దిగి వస్తున్నాయని కేంద్రం తెలిపింది. బఫర్ స్టాక్ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, […]
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి […]