నిర్మల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.
Read Also: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన పెనుప్రమాదం