టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ రేసులో లేకపోవడానికి కారణం పాకిస్థాన్‌పై ఓటమి. ఈ ఓటమి మన ఆటగాళ్ల మానసిక బలాన్ని దెబ్బతీసింది. దీంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పాకిస్థాన్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత అభిమానులు ఆసీస్‌కు మద్దతు పలికారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవాలని కోరుకున్నారు. చివరకు పాకిస్థాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.
Read Also: విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్
ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. ఇటీవల దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులతో ఘనంగా సత్కరించగా… ఆ ఫోటోలను ఎడిట్ చేసి మీమ్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాథ్యూ వేడ్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చినట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అటు వేడ్ క్యాచ్ డ్రాప్ చేసిన హసన్ అలీ పాకిస్థాన్ వెళ్తే ఎలా ఉంటాడో కూడా కొందరు మీమ్స్ చేశారు. కాగా భారత్‌పై పాకిస్థాన్ గెలిచినప్పుడు రోహిత్, కోహ్లీ, రాహుల్‌లు ఎలా షాట్స్ కొట్టి అవుటయ్యారో పాక్ మాజీ క్రికెటర్ షాహిన్ అఫ్రిది ఇమిటేట్ చేయడం భారత అభిమానులకు తీవ్రంగా కోపం తెప్పించింది.
Hasan Ali returning to Pakistan……. pic.twitter.com/mNpsh6HJSw
— Krishna (@Atheist_Krishna) November 12, 2021