కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలా ప్రేమలో పడిపోయారు.
Read Also: యువకుడి కల నెరవేర్చిన ఆనంద్ మహీంద్రా…నెటిజన్లు ఫిదా
ఒకరోజు ఈ ఇద్దరు యువకులు తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ప్రెస్ చేసుకున్నారు. దీంతో వారిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. సృష్టికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయికుమార్ మస్కట్ వెళ్లిపోయాడు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా తన ప్రియుడు దూరమయ్యాడని సాయికుమార్ ఆవేదన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి కోసం సాయికుమార్ మైదుకూరు వచ్చాడు. తన ప్రియుడి సంగతి పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని… మైదుకూరు పీఎస్ బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే తనను ప్రేమించిన యువకుడు తనతో ఒకలా.. అతడి తల్లిదండ్రుల వద్ద మరోలా మాట్లాడుతున్నాడని సాయికుమార్ ఆరోపిస్తున్నాడు. అతడు లేకపోతే తాను బతకలేనని కరాఖండిగా చెప్తున్నాడు. దీంతో అతడి ప్రేమను తెలుసుకున్నవారు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ అబ్బాయిల ప్రేమకథ వైరల్ అవుతోంది.