ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుపై తమ వ్యతిరేకతను ప్రజలు బాహాటంగానే చూపించారని ఏపీ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యానించారు. కుప్పంలో ప్రజలు కూడా టీడీపీని వ్యతిరేకించడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పోయిందన్నారు. మండలి ఛైర్మన్‌గా తన సోదరుడు, దళితుడు మోషేన్‌రాజు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారని జగన్ తెలిపారు.
Read Also: అది కౌరవ సభ.. గౌరవం లేని సభ : చంద్రబాబు ఫైర్
చంద్రబాబు, టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ అజెండానే ముఖ్యం అని.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సబబు కాదని హితవు పలికారు. చంద్రబాబు ఫస్ట్రేషన్‌లో ఉన్నారని ప్రజలకు తెలుసు అని జగన్ పేర్కొన్నారు. వ్యవసాయంపై సభలో చర్చ సందర్భంగా విపక్షాలు లేకపోవడం బాధాకరమని.. ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని కానీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము చాలా పథకాలు తీసుకువచ్చాయని జగన్ వెల్లడించారు.