చంద్రబాబుది అంతా డ్రామా.. కావాలనే రెచ్చగొట్టారు: జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.
Read Also: మీడియా ముందే బోరున విలపించిన చంద్రబాబు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
వైఎస్ వివేకానందరెడ్డి తన బాబాయ్ అని… ఆయనతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వివేకా హత్య చంద్రబాబు హయాంలో జరిగిందని, తన చిన్నాన్నను టీడీపీ వాళ్లే ఏదైనా చేసి ఉండాలని జగన్ ఆరోపించారు. ‘ఓ వైపు మా నాన్న తమ్ముడు, ఇంకో వైపు నాన్న తమ్ముడి కొడుకు. ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది’ అని జగన్ నిలదీశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలు చంద్రబాబు హయాంలోనే జరిగాయని జగన్ గుర్తుచేశారు. మల్లెల బాబ్జీ తన సూసైడ్ నోట్‌లో చంద్రబాబు పేరు రాశాడని జగన్ తెలిపారు. తనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా వ్యవస్థలు లేవు అని… తప్పుడు వార్తలు పదేపదే చెప్తే నిజం అవుతుందని అనుకుంటున్నారని… చంద్రబాబు కళ్లలో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని… అసెంబ్లీలో చంద్రబాబు కావాలనే తమ నేతలను రెచ్చగొట్టారని జగన్ విమర్శించారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!