ఆ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు: స్వరూపానందేంద్ర స్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. నిత్యం వెంకటేశ్వరస్వామి పాదాల చెంత జీవించారని.. ఈ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మ శాంతించాలని.. ఆయన సాక్షాత్తూ మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
మరోవైపు డాలర్ శేషాద్రి మరణంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. శేషాద్రి మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అన్నారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్న శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు డాలర్ శేషాద్రి పెద్ద దిక్కుగా పనిచేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అటు శేషాద్రి మరణంపై టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు కూడా స్పందించారు. తనకు డాలర్ శేషాద్రి ప్రాణ సమానుడు అని… ఆయన లక్షలాది మంది శ్రీవారి భక్తులకు ప్రీతిపాత్రుడు అని తెలిపారు. శేషాద్రి సేవలు టీటీడీకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. 50 ఏళ్లుగా స్వామివారికి సేవలు అందించిన మహనీయుడు అని కొనియాడారు. శేషాద్రికి ముందు…శేషాద్రి తరువాత అన్నట్లు టీటీడీలో చరిత్ర లిఖించబడుతుందన్నారు. శేషాద్రి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రీనివాసరాజు వ్యాఖ్యానించారు. చివరి నిమిషం వరకు స్వామి సేవలోనే తరిస్తూనే పరమపదించాలన్న తన కోరికను శేషాద్రి నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!