బిగ్‌బాస్-5 తెలుగు ఆసక్తికరంగా మారింది. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే రవి ఎలిమినేషన్‌పై పెద్ద రచ్చ మొదలైంది. అతడి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేని అభిమానులు నిరసనకు దిగారు. కావాలనే రవిని ఎలిమినేట్ చేశారని.. దీని వెనుక కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు.
Read Also: విశాఖలో మరోసారి గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి
ఈ నేపథ్యంలో యాంకర్ రవికి అన్యాయం జరిగిందని సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోకు వస్తున్న ఓట్ల లెక్కలను నిర్వాహకులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రేక్షకులను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. స్ట్రాటజీ ప్రకారమే రవిని హౌస్ నుంచి బయటకు పంపారని.. రవి కంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్లను హౌస్‌లో ఉంచి ఒకరికి ప్రయోజనం చేకూరేలా బిగ్‌బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని నవీన్ గౌడ్ మండిపడ్డారు.