నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు కాపాడినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి